LIVE: ఉండిలో చంద్రబాబు ప్రజాగళం బహిరంగ సభ - ప్రత్యక్ష ప్రసారం - Chandrababu Prajagalam live - CHANDRABABU PRAJAGALAM LIVE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 10, 2024, 12:25 PM IST
|Updated : May 10, 2024, 12:58 PM IST
Chandrababu Prajagalam Election Campaign Live : రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుతోంది. ఈ నెల 11న సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంది. మిగిలిన తక్కువ సమయంలో ముఖ్యనేతలను రప్పించి పట్టణాలు, మండల కేంద్రాల్లో రోడ్‌షోలు, సమావేశాలు నిర్వహించేలా అన్ని పార్టీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటివరకు పర్యటించని ప్రాంతాల్లో నియోజకవర్గ, జిల్లా నేతలతో ప్రచారం చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దూసుకుపోతున్నారు. మార్చి 27న 'ప్రజాగళం' పేరుతో రాష్ట్ర వ్యాప్త పర్యటన ప్రారంభించిన ఆయన ఇప్పటి వరకు 82 సభలు నిర్వహించారు. ప్రచారానికి శనివారం సాయంత్రంతో తెరపడనుండడంతో ఆయన మరింత దూకుడు పెంచారు. శుక్రవారం ఒక్క రోజే ఉండి, ఏలూరు, గన్నవరం, మాచర్ల, ఒంగోలు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభల్లో ప్రసంగిస్తారు. శనివారం మరో మూడు నియోజక వర్గాల్లో పర్యటిస్తారు. ప్రచార గడువు ముగిసే నాటికి మొత్తం 90 నియోజకవర్గాల్లో ఆయన పర్యటన పూర్తికానుంది.ప్రస్తుతం ఉండి ప్రజాగళం సభలో నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్ని ప్రసంగిస్తున్నారు. మీ కోసం ప్రత్యక్ష ప్రసారం
Last Updated : May 10, 2024, 12:58 PM IST