'గుమ్మనూరు జయరాంకు బ్రహ్మారథం పట్టిన గుత్తి ప్రజలు' - టీడీపీ శ్రేణులపై ఉన్న అక్రమ కేసులను కొట్టి వేయించే బాధ్యత నాదే : జయరాం - TDP candidates Gooty tour - TDP CANDIDATES GOOTY TOUR
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 31, 2024, 10:50 PM IST
Gummanur Jayaram and Ambika Lakshminarayana in Gooty Tour : వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన గుమ్మనూరు జయరాంకు చంద్రబాబు గుంతకల్లు ఎమ్మెల్యే టికెట్ కేటాయించడంతో మెుదట్లో నియోజకవర్గ ప్రజలు నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అప్పుడు జయరాంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాని ఈరోజు గుత్తి పట్టణానికి వచ్చిన జయరాంకు అనుహ్య సంఘటన ఎదురైంది. అదే ప్రజలు గుమ్మనూరు జయరాంకు ఘనస్వాగతం పలికారు. వందలాదీ కార్లతో గుత్తిలోని రోడ్లు మెుత్తం నిండిపోయి పట్టణం మెుత్తం జనసంద్రంగా మారింది. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు జై టీడీపీ, జై జయరాం అంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.
అనంతరం గుమ్మనూరు జయరాంతో పాటు అనంతపురం ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ గుత్తిలోని బాట సుంకులమ్మ ఆలయాన్ని సందర్శించారు. తరువాత ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇద్దరు అభ్యర్థులు ప్రచార రథంపై ఎక్కి గుత్తి రోడ్లపై ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జయరాం మాట్లాడుతూ, ప్రతి గ్రామానికి స్వయంగా వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కారిస్తానని తెలిపారు. పోలీస్ స్టేషన్లలో టీడీపీ శ్రేణులుపై అక్రమంగా పెట్టిన కేసులను కొట్టివేయించే బాధ్యత తీసుకుంటానన్నారు. టీడీపీ శ్రేణులకు ఇప్పుడే స్వాతంత్రం వచ్చిందని తెలిపారు. ఇకపై టీడీపీ శ్రేణులు ఎవరు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కకుండా చూసుకుంటానని కార్యకర్తలకు హామీ ఇచ్చారు.