LIVE: తెలుగుదేశం-బీజేపీ-జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో విడుదల - ప్రత్యక్ష ప్రసారం - TDP JANASENA BJP MANIFESTO - TDP JANASENA BJP MANIFESTO
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 30, 2024, 3:05 PM IST
|Updated : Apr 30, 2024, 4:00 PM IST
TDP JANASENA BJP MANIFESTO: రాష్ట్ర ప్రజల నేటి అవసరాలు తీరుస్తాం, రేపటి ఆకాంక్షలను సాకారం చేస్తాం అనే నినాదంతో తెలుగుదేశం - జనసేన - బీజేపీల ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో విడుదల చేసిన మేనిఫెస్టో కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లతో పాటు బీజేపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంపు, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటివి ఇప్పకిటే ప్రకటించారు. సామాజిక పింఛను 2024 ఏప్రిల్ నుంచే వర్తింపును సైతం తెలుగుదేశం ప్రకటించింది. దివ్యాంగులకు పింఛను రూ.6 వేలకు పెంపు, బీసీలకు 50 ఏళ్లకే పింఛను, ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500, యువతకు ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి, తల్లికి వందనం కింద చదువుకుంటున్న పిల్లలకు ఏడాదికి రూ.15 వేల ఆర్థికసాయం, రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం, వాలంటీర్ల గౌరవ వేతనం రూ.10 వేలకు పెంపు వంటివి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసందే. ప్రస్తుతం ఇంకా కొత్తవి ఏవి ఉంటాయో అని ప్రజలంతా చూస్తున్నారు. తెలుగుదేశం-బీజేపీ-జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో విడుదల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Apr 30, 2024, 4:00 PM IST