ఒంగోలులో సైకత శిల్పం - ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం - SVEEP Awareness Program - SVEEP AWARENESS PROGRAM
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 26, 2024, 2:51 PM IST
SVEEP Awareness Program in Prakasam District : ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ ప్రజలలో చైతన్యం కలిగించేందుకు స్వీప్‌లో (Systematic Voter Education and Electoral Participation) భాగంగా ప్రకాశం జిల్లా యంత్రాంగం పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఒంగోలు నగరంలోని చర్చి సెంటర్లో ఓటు ప్రాముఖ్యత, ఓటు వినియోగంపై అవగాహన కల్పించే లక్ష్యంతో సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు.
Sand Sculpture of Vote: సాధారణంగా తీర ప్రాంతాల్లో మాత్రమే చూసే సైకత శిల్పాన్ని ఒంగోలు పట్టణ నడిబొడ్డున ఏర్పాటు చేయడంతో ప్రజలు ఎంతో ఉత్సాహంగా దీనిని తిలకిస్తున్నారు. విజయవాడకు చెందిన ప్రముఖ సైకత శిల్పి బాలాజీ ప్రసాద్ 24 గంటలు శ్రమించి ఈ సైకత శిల్పాన్ని పూర్తి చేసినట్టు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఏ. ఎస్. దినేష్ కుమార్ ఈరోజు సైకత శిల్పాన్ని సందర్శించి శిల్పి బాలాజీ ప్రసాద్‌ను అభినందించారు. ఈ సందర్బంగా కలెక్టర్ దినేష్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ, ప్రజల్లో ఓటర్ చైతన్యం కోసం విభిన్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగానే వినూత్నంగా ఈ సైకత శిల్పాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని స్పష్టం చేశారు. ప్రజలందరూ మే 13వ తేదీన పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.