అధికారుల అండతో ఎమ్మెల్యే కేతిరెడ్డి భూ ఆక్రమణ - కలెక్టర్​కు ఫిర్యాదు - satyasai district

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 29, 2024, 3:31 PM IST

Suryanarayana complained to the collector against MLA Kethi Reddy : ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి అధికారుల అండతో భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని సత్యసాయి జిల్లా కలెక్టర్​ అరుణ్​బాబుకు మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ ఫిర్యాదు చేశారు. ధర్మవరంలో జరుగుతున్న భూ దందాల విషయంలో ఇటీవల పలు అధికారులను సస్పెండ్​ అయ్యారన్నారు. సామాన్య ప్రజల విలువైన భూములను కేతిరెడ్డి కబ్జా చేస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.

MLA Kethi Reddy Who Has Encroached on Government Land : జిల్లా పరిధిలోని 122 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇళ్లు పట్టాలుగా కేతిరెడ్డి మార్చుకున్నారని సూర్యనారాయణ ఆరోపించారు. అందులో ప్లాట్లు వేసుకొని ఆర్జిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలో ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం ఏమీ జరగనట్లు చోద్యం చూస్తున్నారని పేర్కొన్నారు. భూకబ్జాకు సంబంధించిన పూర్తి వివరాలను కలెక్టర్లకు తెలియజేసినట్లు పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్ అరుణ్​బాబు పారదర్శకంగా వ్యవహరిస్తారని, తప్పుచేసిన ఎమ్మార్వో, వీఆర్వోలను ఇటీవల సస్పెండ్​ చేశారని తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.