11వేల చదరపు అడుగుల్లో రాముడి రంగోలీ- మెరిసిపోతున్న పింక్ గోల్డ్ రింగ్
🎬 Watch Now: Feature Video
Surat Ram Rangoli : ఉత్తర్‌ప్రదేశ్ అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో దేశవ్యాప్తంగా వినూత్నంగా వేడుకలు నిర్వహించుకుంటున్నారు భక్తులు. ఈ క్రమంలో గుజరాత్‌లోని సూరత్‌లో 40 మంది యువతులు భారీ రంగోలీని తీర్చిదిద్దారు. 11,111 చదరపు అడుగుల విస్తీర్ణంలో రంగోలీని ఏర్పాటు చేశారు. రామాయణంలోని కీలక ఘట్టమైన రామ సేతు నిర్మాణ దృశ్యాన్ని రంగోలీలో తీర్చిదిద్దారు. అయోధ్య ఆలయం, సీతారామ లక్ష్మణులతో పాటు హనుమంతుడి చిత్రం రంగోలీలో కనిపిస్తోంది. 1400 కిలోల రంగులతో 15 గంటల పాటు కష్టపడి ఈ రంగోలీని వేశారు యువతులు.
Ayodhya Pink Gold Ring : వజ్రాభరణాల తయారీకి పెట్టింది పేరైన సూరత్‌లో అయోధ్య రామ మందిరానికి గుర్తుగా ప్రత్యేక ఉంగరాలు తయారు చేశారు స్వర్ణకారులు. ఉంగరంపై చిన్నసైజులో రామాలయ ప్రతిమను తీర్చిదిద్దారు. 38 గ్రాములతో చేసిన ఈ ఉంగరం గులాబీ రంగులో మెరిసిపోతూ చూపరులను ఆకట్టుకుంటోంది. ఈ ఉంగరం ధర రూ.3లక్షలుగా నిర్ణయించారు. 178 ఉంగరాలకు ఆర్డర్లు వచ్చినట్లు తయారీదారులు తెలిపారు. డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని మొత్తంగా 350 ఉంగరాలను తయారు చేసినట్లు వివరించారు.
రాముడికి కానుకగా 400 కేజీల తాళం- రూ.1.65 లక్షల రామాయణం ప్రదర్శన