LIVE : వైఎస్ సునీతా రెడ్డి మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - Sunitha Reddy Press Meet - SUNITHA REDDY PRESS MEET
🎬 Watch Now: Feature Video
Published : Apr 6, 2024, 11:11 AM IST
|Updated : Apr 6, 2024, 1:22 PM IST
Sunitha Reddy Press Meet Live : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత మీడియా సమావేశం నిర్వహించారు. వివేకాని చంపిన అవినాష్‌రెడ్డి వైపు ఉంటారో న్యాయం కోసం పోరాడుతున్న తమ వైపు ఉంటారో ప్రజలు తేల్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సీఎం జగన్, కడప ఎంపీ అవినాష్‌రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఇప్పటికే పీసీసీ అధ్యక్షురాలు, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల వైఎస్ఆర్ కడప జిల్లా ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా, షర్మిల వెంట వివేకా కుమార్తె షర్మిల కూడా వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె జగన్‌పై ఆరోపణలు చేశారు. షర్మిల, సునీత ఇరువురూ వైఎస్ వివేకా హత్య అంశాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా తీసుకుని ముందు సాగుతున్నారని అన్నారు. సీఎం జగన్, ఎంపీ అవినాష్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. వివేకాని చంపిన అవినాష్‌రెడ్డి ఓ వైపు ఉంటే, ఆ కేసులో న్యాయం కోసం పోరాటం చేస్తున్నామని సునీత తెలిపారు. తన తండ్రి హత్యకు కారకులైన వారికి త్వరలోనే శిక్ష పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Last Updated : Apr 6, 2024, 1:22 PM IST