సింహాచలంలో సుదర్శన నృసింహ యజ్ఞం- ముఖ్య అతిథిగా స్వరూపానందేంద్ర సరస్వతి - simhaadri sudarshana yagnam

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 27, 2024, 5:08 PM IST

thumbnail

Sudarshan Narasimha Yagam in Simhachalam: విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో అంగరంగ వైభవంగా సుదర్శన నరసింహ యజ్ఞం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి (Swaroopanandendra Saraswati) హాజరయ్యారు. ఆలయ అనువంశ ధర్మకర్త అశోక్ గజపతిరాజు పూజల్లో పాల్గొన్నారు.

ఈరోజు నుంచి ఏప్రిల్ ఒకటి వరకు ఈ మహా యజ్ఞం జరగనుందని ఆలయ స్థానాచార్యులు రాజగోపాల్ తెలిపారు. ఈ పూజల్లో పాల్గొంటే శారీరక రుగ్మతలు తొలగుతాయని రాజగోపాల్ ఆచార్యులు తెలిపారు. స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి విశేష పూజలు నిర్వహించి అనంతరం ప్రత్యేక యాగశాలలో ఉత్సవ మూర్తులను అధిష్టింపజేసి యజ్ఞం ప్రారంభించారు. ఈ మహా యజ్ఞం సందర్భంగా ఆలయంలో అన్ని ఆర్జిత సేవలను దేవస్థానం రద్దు చేసింది. ఈ సుదర్శన నరసింహ మహా యజ్ఞం సందర్భంగా గాలిగోపురాన్ని, ప్రధాన ఆలయాన్ని రకరకాల పుష్పాలతో అలంకరించారు. ప్రతిరోజు స్వామివారిని ఒక్కొక్క అవతారంలో అలంకరిస్తామని అర్చకులు తెలిపారు. భక్తులు ఈ పూజలో పాల్గొనాలంటే మూడు వేల రూపాయిలు చెల్లించి దంపతులు, ఇద్దరు పిల్లలు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.