DRO Played Online Rummy During Meeting at Collectorate: ఆయనో బాధ్యాతాయుతమైన ప్రభుత్వ పదవిలో ఉన్న జిల్లా రెవెన్యూ అధికారి. ఈ క్రమంలో ఆయనో ముఖ్యమైన సమావేశానికి హాజరయ్యారు. ఆ సమావేశానికి ఉన్నతాధికారులైన కలెక్టర్లు, ఎస్పీలు, ఇతరులు హాజరయ్యారు. ఇదే సమావేశానికి రెవెన్యూ అధికారి కూడా హాజరయ్యారు. కానీ ఆయన ఆ సమావేశంలో చేసిన పనికి మాత్రం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇంతకీ ఆ పని ఏంటి అనుకుంటున్నారా. కలెక్టరేట్ కార్యాలయంలో ఒకపక్క సమావేశం జరుగుతుండగా మొబైల్ ఫోన్లో రమ్మీ ఆడుతూ జిల్లా రెవెన్యూ అధికారి బిజీబిజీగా గడిపారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.
అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సమావేశం సోమవారం (20-01-2025) జరిగింది. అయితే ఈ సమావేశంలో అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్లు వినోద్ కుమార్, చేతన్, ఎస్పీ జగదీష్, అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగాను, అనుకూలంగా జనం తరలివచ్చారు.
సమావేశం జరుగుతున్నా తనకేమీ పట్టనట్టు డీఆర్ఓ మలోల మొబైల్ ఫోన్లో పేకాట ఆడుతూ కాలక్షేపం చేశారు. పక్కనే ఉన్నతాధికారులు ఉన్నా ఆన్లైన్లో పేకాట ఆడటంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. డీఆర్ఓ మలోల ఆన్లైన్లో పేకాట ఆడుతున్న వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
బ్రాండెడ్‌కు ఏమాత్రం తీసిపోదు - జోరుగా నకిలీ సిగరెట్ల వ్యాపారం
గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్‌కు ఏపీ హబ్‌గా మారబోతోంది: సీఎం చంద్రబాబు