ఐఎఫ్‌ఎస్ ఫలితాల్లో తెలంగాణ యువకుడికి 44వ ర్యాంక్ - సక్సెస్ సీక్రెట్ ఇదేనట! - Ajay Kumar IFS Success story - AJAY KUMAR IFS SUCCESS STORY
🎬 Watch Now: Feature Video
Published : May 12, 2024, 4:33 PM IST
UPSC Topper Ajay Kumar IFS Success story : ఇండియన్ ఫారెస్ట్ సర్వీసుల్లో తెలుగు వారు సత్తా చాటారు. తొలి ప్రయత్నంలో ప్రిలిమ్స్‌ను సైతం దాటనప్పటికీ, రెండో ప్రయత్నంలో కష్టపడి చదివి ఫారెస్ట్ సర్వీసుల్లో 44వ ర్యాంకు సాధించారు అజయ్ కుమార్. ఎంటెక్ చదివినా సమాజానికి సేవ చేయాలన్న లక్ష్యంతో సాఫ్ట్‌వేర్ కొలువుకు బదులుగా, సివిల్స్ వైపు వెళ్లాలనుకున్నారు అజయ్ కుమార్. ఓటమికి భయపడక కష్టపడితే విజయం తప్పక సొంతమవుతుందని చెబుతున్నారు.
సివిల్స్ అంటే ఆసక్తి ఉన్నవారు సొంత ప్రణాళికతో కష్టపడి కృషి చేస్తే తప్పకుండా విజయం సాధించవచ్చునని పేర్కొంటున్నారు. తాను గత ప్రశ్నపత్రాలను ఎక్కువగా పరిశీలించానని, సిలబస్ చదవడం పూర్తయ్యాక ఎక్కువగా టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేశానని చెబుతున్నారు. తల్లిదండ్రులు, స్నేహితులు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిదని పేర్కొన్నారు. తన లక్ష్యం ఐఏఎస్‌గా ఎంపిక కావడమేనని, దానికోసం మరింతగా కృషి చేస్తానని, ప్రిపరేషన్‌ను కొనసాగించనున్నట్లు తెలిపారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసుల్లో (ఐఎఫ్‌ఎస్) అద్భుతంగా రాణించిన అజయ్ కుమార్‌తో మా ప్రతినిధి ముఖాముఖి.