ఎడ్లబండిపై ఉపాధ్యాయుడి ఊరేగింపు - గురుభక్తి చాటుకున్న విద్యార్థులు - Teacher Retirement Celebrations - TEACHER RETIREMENT CELEBRATIONS
🎬 Watch Now: Feature Video


Published : Aug 1, 2024, 12:59 PM IST
Teacher Retirement Celebrations : శిష్యుల అభిమానం పూలవానై కురిసింది. గురువు గుండె ఆనందంతో పులకించింది. బడిలో ఆడుతూపాడుతూ ఆహ్లాదకరంగా పాఠాలు చెప్పిన గురువుకు గుండెల్లోనే గుడికట్టుకున్నారు ఆ శిష్యులు. పదవీ విరమణ పొందిన ఆ ఉపాధ్యాయుడిని ఎడ్లబండిపై ఊరేగించి గురుభక్తి చాటుకున్నారు. వరంగల్ జిల్లాలోని దుగ్గొండి ఉన్నత పాఠశాలలో అనుమాండ్ల జనార్దన్ హిందీ ఉపాధ్యాయుడిగా రెండున్నర సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులతో పాటు తోటి ఉపాధ్యాయులతో ఆప్యాయతగా ఉంటూ అందరి మన్ననలు పొందారు.
Students Celebrated Teacher Retirement : బుధవారం ఆ ఉపాధ్యాయుడు పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా జనార్దన్, జయ దంపతులను ఆ పాఠశాల విద్యార్థులు గ్రామస్థులతో కలిసి ఎడ్లబండిపై గ్రామంలో ఊరేగించారు. అడుగడుగునా వారిపై పూల వర్షం కురిపించారు. ప్రత్యేక వేషధారణలో కోలాటాలు వేస్తూ బతుకమ్మలు, బోనాలతో అడి పాడారు. నృత్యాలు చేస్తూ ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా విద్యాభ్యాసంతో పాటు ఎన్నో సంస్కృతి కార్యక్రమాలను ముందుండి నడిపేవారని విద్యార్థులు కొనియాడారు.