YUVA : సమంత, సాయిపల్లవి లాంటి స్టార్​ హీరోయిన్లకు డబ్బింగ్​ చెప్పింది నేనే : ఆద్య హనుమంతు - Story On Dubbing Artist Aadhya - STORY ON DUBBING ARTIST AADHYA

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Sep 7, 2024, 5:49 PM IST

Story On Dubbing Artist Aadhya Hanumanthu : చలాకీగా అచ్చం సాయిపల్లవిలా మాట్లాడేస్తున్న ఆ గొంతుకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఇంత అందంగా మాట్లాడేది ఓ అబ్బాయి అని తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఇదొక్కటేనా నృత్యం, సంగీతం, నటన, చదువు ఇలా అన్నింటినిలోనూ వారెవ్వా అనిపిస్తున్నాడు. మెడిసిన్ చదువుతూనే డబ్బింగ్ కళాకారుడిగా సత్తా చాటుతున్నారు ఆద్య హనుమంతు. టాప్​ హీరోయిన్లకు ఆద్య గాత్రదానం చేస్తున్నారు. ప్రముఖ హీరోయిన్ సమంత, సాయిపల్లవి లాంటి మరెంతో మంది హీరోయిన్లకు డబ్బింగ్​ చెబుతూ తన ప్రత్యేకతను చాటుకున్నారు.  

డబ్బింగ్​ చెప్పడాన్ని ఓ హాబీగా మొదలుపెట్టిన ఆద్య హనుమంతు అనతి కాలంలోనే మంచి గుర్తింపు పొందారు. అతను కష్టం ఊరికే పోలేదు. 2023లో జాతీయ ఉత్తమ వాయిస్​ ఓవర్​గా అవార్డును దక్కించుకున్నారు. ఎంబీబీఎస్​ పూర్తిచేసిన ఆద్య హనుమంతు ప్రస్తుతం సైకియాట్రీలో పీజీ చేస్తున్నారు. డాక్టర్​గా ప్రజలకు సేవలందిస్తూ, మరోవైపు ఆర్టిస్​గా మంచి పేరుతెచ్చుకోవాలనేదే తన లక్ష్యమంటున్న ఆద్య హనుమంతుతో మా ప్రతినిధి ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.