వందేభారత్​ రైలుపై దుండగుల రాళ్లదాడి- అద్దాలు ధ్వంసం

🎬 Watch Now: Feature Video

thumbnail

Stone Pelting On vande Bharat Express : తమిళనాడులో వందేభారత్‌ రైలుపై రాళ్లదాడి జరిగింది. తిరునల్వేలి- చెన్నై మధ్య సేవలందిస్తున్న రైలుపై రాళ్లదాడి జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. తూత్తుకుడి జిల్లాలోని మనియాచి రైల్వేస్టేషన్ మీదుగా వెళుతుండగా దుండగులు ఆదివారం ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వివరించారు. ఈ ఘటనలో పలు కోచ్​లలోని అద్దాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. దీంతో రైలు ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారని చెప్పారు.

వెంటనే అధికారులు అప్రమత్తమై వందేభారత్ రైలును నెల్లి రైల్వే స్టేషన్​కు సురక్షితంగా తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం స్వల్పంగా దెబ్బతిన్న రైలు బోగీల అద్దాలను తాత్కాలికంగా రిపేర్ చేయించారు. ఆ తర్వాత సోమవారం ఉదయం వందేభారత్ రైలు చెన్నైకి బయలుదేరింది. రాబోయే వారాంతపు సెలవులో రైలుకు పూర్తి మరమ్మతులు చేయిస్తామని అధికారులు తెలిపారు. ఈ దాడులకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Stones On Vande Bharat Railway Track : పట్టాలపై రాళ్లు, ఇనుప రాడ్లు.. వందేభారత్​కు తప్పిన భారీ ప్రమాదం

Smoke in Vande Bharat Train: వందే భారత్ రైలులో పొగలు.. తప్పిన పెను ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.