LIVE: రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం - State Level Bankers Meeting Live - STATE LEVEL BANKERS MEETING LIVE
🎬 Watch Now: Feature Video
Published : Jun 19, 2024, 12:43 PM IST
|Updated : Jun 19, 2024, 1:03 PM IST
State Level Bankers Meeting Live : హైదరాబాద్‌లోని మ్యారీగోల్డ్ హోటల్‌లో 41వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ బ్యాంకర్ల సమావేశంలో రూ.2 లక్షల రుణమాఫీ అంశంపై కీలక చర్చ జరుగుతుంది. అలాగే 2024-25 వార్షిక రుణ ప్రణాళికపై విస్తృతంగా చర్చిస్తున్నారు. రుణ వివరాలు సరైన పద్ధతిలో బ్యాంకర్లను ఇవ్వాలని కోరుతున్నామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో ఆయిల్ పామ్ పంటలు వస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ ఈ బ్యాంకర్ల సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, నాబార్డ్ సీజీఎం చింతల సుశీల గోవిందరాజులు పాల్గొన్నారు. రుణమాఫీతో పాటు కీలక అంశాలపై చర్చించేందుకు ఈనెల 21న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఆగస్టు 15 వరకు రైతురుణ మాఫీ చేసి తీరతామని పలు సందర్భాల్లో పునరుద్ఘాటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారులతో వరస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
Last Updated : Jun 19, 2024, 1:03 PM IST