శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం - 7 గేట్లు ఎత్తి నీటి విడుదల - Srisailam Dam Gates Lifted
🎬 Watch Now: Feature Video
Published : Jul 30, 2024, 10:00 PM IST
Srisailam Project 5 Gates Lifted In AP : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది. వరద ప్రవాహం పెరగడంతో, అధికారులు 7 గేట్లను ఎత్తారు. ఒక్కో గేటును 10 అడుగుల మేర పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్‌వే ద్వారా 1.91 లక్షల నీటిని నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. మరోవైపు శ్రీశైలం జలాశయానికి జూరాల, సుంకేసుల నుంచి 4.27 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ఈ సుందర దృశ్యాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 883.50 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 207.41 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 3.88 లక్షల క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 2.70 లక్షల క్యూసెక్కులుగా ఉంది. కుడి ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ముమ్మరంగా జరుగుతుంది. విద్యుత్ ఉత్పత్తి చేసి నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.