ఇంటర్ పూర్తయిందా? నెక్ట్స్ ఏంటి అనే డైలమాలో ఉన్నారా? అయితే ఇది మీకోసమే! - Prof Limbadri Special Interview - PROF LIMBADRI SPECIAL INTERVIEW
🎬 Watch Now: Feature Video
Published : May 24, 2024, 7:24 PM IST
|Updated : May 24, 2024, 7:32 PM IST
Prof Limbadhri Special Interview on Degree Courses : ఇంటర్ పూర్తయితే చాలు తర్వాత ఏ కోర్సు చదవాలి? ఇది ప్రతి విద్యార్థి జీవితంలో ఎదురయ్యే ప్రశ్న. దీనికి ఎక్కువ మంది చెప్పే సమాధానం ఒకటే. అదే ఇంజినీరింగ్. కొందరు ఇతర కోర్సులు చేద్దామని అనుకున్నా, వాటిపై అవగాహన ఉండదు. ఇకపోతే ఏటా కొత్త కొత్త కోర్సులు ప్రవేశపెడుతూ, విద్యార్థుల నైపుణ్యాలు పెంచేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలో కొత్త కోర్సుల వివరాలు, ఫలితంగా విద్యార్థులకు ఒనగూరే ప్రయోజనాలను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖిలో వివరించారు.
DOST Online Process Explanation : అందరూ ఒకే దారిలో నడవకుండా తమకంటూ ప్రత్యేకత చాటుకోవాలని అనుకునే వారికి కొత్త కోర్సులు దోహదపడతాయని ప్రొఫెసర్ తెలుపుతున్నారు. బీఏ, బీకామ్, బీఎస్సీలో కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్న ఉన్నత విద్యామండలి, ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఏఏ కోర్సులు తీసుకొచ్చింది. వాటి విధివిధానాలు ఎలా ఉన్నాయి.? ధరఖాస్తు విధానం ఎలా ఉంటుంది. రాష్ట్రంలో దోస్త్ ప్రక్రియ అమలు ఎలా ఉంది.? ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన విద్యార్థులకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఎలాంటి సూచనలు చేస్తున్నారు.? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.