రావణాపల్లి జలాశయ అభివృద్ధికి సన్నాహాలు- స్పీకర్​ అయ్యన్న హామీ - Ayyanna to Ravana Palli Reservoir - AYYANNA TO RAVANA PALLI RESERVOIR

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 30, 2024, 5:52 PM IST

Speaker Ayyanna Patrudu Visit Ravana Palli Reservoir In Anakapalle District : అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సమీపంలోని గొలుగొండ మండలం రావణాపల్లి జలాశయాన్ని స్పీకర్​ సందర్శించారు. జలాశయం అభివృద్ధి పనులకు నిధులను కేటాయించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని సభాపతి అయ్యన్న పాత్రుడు హామీ ఇచ్చారు. ఈ రోజు (మంగళవారం) ఉదయం ఆయన జలవనరుల శాఖ అధికారులతో కలిసి జలాశయాన్ని సందర్శించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం పరిధిలో సుమారు 3వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ రిజర్వాయర్ మరింత అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట ఆర్డీఓ జయరాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నేడు ఈ ప్రాజెక్టు ఈ స్థితిలో ఉందని ఆరోపించారు. ఇటీవస కురిసిన వర్షాలకు నీరు పొంగిపోయింది. స్థానికులు నీటి మట్టాన్ని గమనించి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకున్నారు. కాగా ఈ సమస్య మరోసారి ఎదురవ్వకుండా ప్రభుత్వం చర్యలు చేపడపతుందని అయ్యన్న హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.