స్పీకర్ అయ్యాక మొదటి సారి నర్సీపట్నానికి అయ్యన్న పాత్రుడు - Ayyanna Patrudu at Visakha Airport - AYYANNA PATRUDU AT VISAKHA AIRPORT

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 29, 2024, 1:48 PM IST

Speaker Ayyanna Patrudu Reach Visakha Airport : అసెంబ్లీ స్పీకర్ అయ్యాక తొలిసారి నర్సీపట్నం వస్తున్న చింతకాయల అయ్యన్న పాత్రుడుకు విశాఖ విమానాశ్రయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అయ్యన్నపాత్రుడు విజయవాడ నుంచి ఇండిగో విమానంలో విశాఖ చేరుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, సభాపతి పదవికి వన్నెతెచ్చేలా నడుచుకుంటానని తెలిపారు. 

Ayyanna Patrudu Went to Narsipatnam : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామరావు ఆశీస్సులతో అతి చిన్న వయసులో మంత్రిగా, ఎంపీగా పని  చేశానని గుర్తు చేశారు. 42 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ తనకు అనేక అవకాశాలు ఇచ్చారని, స్పీకర్ పదవి అనేది చాలా అత్యున్నతమైనదని, ఈ అవకాశం తనకు ఇచ్చినందుకు చాలా ఆనందిస్తున్నానని తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాలో రెండవ స్పీకర్ పదవి తనకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని, తనపై నమ్మకంతో చంద్రబాబు నాయుడు ఈ అవకాశం ఇచ్చారని, సభాపతి  పదవికి గౌరవం తెచ్చేటట్టు నేను పని చేస్తానని తెలిపారు. అనంతరం రోడ్డు మార్గంలో నర్సీపట్నంలోని తన స్వగృహానికి బయలుదేరారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.