పదవినైనా వదలుకుంటా గానీ స్థలాన్ని పోనివ్వను- స్పీకర్ అయ్యన్న సంచలన వ్యాఖ్యలు - SPEAKER AYYANNA FIRE - SPEAKER AYYANNA FIRE
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/23-08-2024/640-480-22277910-thumbnail-16x9-speaker-ayyana.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 23, 2024, 5:34 PM IST
Speaker Ayyanna Patrudu Fire on Narsipatnam RTC Space Lease in Anakapalli District : ప్రజలకు చెందిన ఆర్టీసీ స్థలాన్ని లీజుకివ్వడంపై గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు కోరారు. ఈ స్థలాన్ని కాపాడుకోవడం కోసం అవసరమైతే తన స్పీకర్ పదవిని వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఆర్టీసీ డిపోను సంబంధిత అధికారులతో కలిసి ఆయన సందర్శించారు.
నర్సీపట్నంలో ఎకరం 70 సెంట్ల ఆర్టీసీ స్థలాన్ని షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చింది. ఈ విషయాన్ని అయ్యన్నపాత్రుడు ముందు నుంచి వ్యతిరేకిస్తూ వచ్చారు. ఇప్పుడు అక్కడ నిర్మాణాలు ప్రారంభించేందుకు లీజుదారులు సిద్ధపడిన విషయంపై ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ ప్రాంతాన్ని ఆయన వెళ్లి పరిశీలించారు. ప్రైవేట్ వ్యక్తులతో డిపో మేనేజర్ కుమ్మక్కై కట్టడాలకు సహకరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తానని అయ్యన్న తెలిపారు.