ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు నా వంతు తోడ్పాటు అందిస్తా : సోనూసూద్ - Actor Sonusood On AP CM Chandrababu - ACTOR SONUSOOD ON AP CM CHANDRABABU
🎬 Watch Now: Feature Video
Published : Sep 22, 2024, 6:44 PM IST
Sonu Sood Praises AP CM Chandrababu Naidu : అధికారం చేపట్టిన తొలి 100 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తన విశిష్ఠ పాలనతో ఏపీ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా చర్యలు చేపట్టారని ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ ప్రశంసల జల్లు కురిపించారు. పరిపాలనలో సుదీర్ఘ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి, తన చక్కని విజన్‌తో రాష్ట్ర భవిష్యత్ కోసం చర్యలు తీసుకుంటున్నారని కొనియాడారు. ఆయనను ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. చంద్రబాబును చూసి గర్వపడుతున్నట్లుగా సోనూసూద్ తెలిపారు. ఈ సందర్భంగా సీబీఎన్‌కు ఆయన అభినందనలు తెలిపారు. త్వరలోనే ఏపీ సీఎం చంద్రబాబును కలవాలనుకుంటున్నట్లు తెలిపారు.
"వంద రోజుల పాలనతో తాము సురక్షితంగా ఉన్నామనే భావన ప్రజలకు కల్పించడంలో చంద్రబాబు విజయవంతమయ్యారు. రాష్ట్ర భవిష్యత్తును బాగు చేయడమే లక్ష్యంగా 'వింటేజ్ చంద్రబాబు'ను గుర్తుచేసేలా పాలన ఉందని ప్రజలు అనుకుంటున్నారు. మంచి పాలన అందిస్తున్న చంద్రబాబుకు అభినందనలు. ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేకమైన ప్రాంతంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో నా వంతు తోడ్పాటు అందిస్తా" అని సోనూసూద్ తెలిపారు.