మీ సంకల్పమే తెలంగాణ ఇవ్వాలన్న ప్రేరణను నాలో కలిగించింది - దశాబ్ది వేడుకల సందర్భంగా సోనియా గాంధీ సందేశం - Sonia Gandhi Formation Day Wishes - SONIA GANDHI FORMATION DAY WISHES
🎬 Watch Now: Feature Video
Published : Jun 2, 2024, 12:14 PM IST
Sonia Gandhi Formation Day Wishes Video : రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు వీడియో సందేశాన్ని విడుదల చేశారు. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తుందని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
'తెలంగాణ రాష్ట్ర సోదరసోదరీమణులందరికీ నమస్కారం. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ప్రత్యేక రాష్ట్ర కల సాకారాన్ని కాంగ్రెస్ పార్టీ నెరవేస్తుందని కరీంనగర్ ప్రజలకు 2004లో నేను హామీ ఇచ్చాను. ఈ వాగ్దానంతో మా పార్టీలో అంతర్గతంగా అసమ్మతి చెలరేగింది. చాలా మంది నేతలు మా పార్టీని కూడా వీడారు.
కానీ ప్రత్యేక రాష్ట్రం కోసం మీ ధైర్యం, సంకల్పం తెలంగాణ ఇచ్చి తీరాలనే శక్తి సాహసాలు, ప్రేరణను నాకు కల్పించాయి. పదేళ్లలో మీరంతా నాపై ఎంతో ప్రేమ,వాత్సల్యం చూపించారు. మీరంతా సమృద్ధ, వికసిత తెలంగాణ సాధన దిశగా కాంగ్రెస్ పార్టీకి బాధ్యతలు అప్పగించారు. మీ కలలన్నీ సాకారం చేయడం మా బాధ్యతగా మేము భావిస్తున్నాం. ప్రత్యేక రాష్ట్ర అవతరణ శుభసందర్భంగా మీ అందరికీ నేను ఒకటే హామీ ఇస్తున్నాను. రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారు ప్రజలకిచ్చిన గ్యారంటీలను అమలు చేయడంలో కార్యసిద్ధులై ఉంటారని చెబుతున్నాను. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రగతి, ఉజ్వల భవిష్యత్తు కోసం శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని' సోనియా గాంధీ వీడియో సందేశాన్ని తెలిపారు.