హిమాయత్‌నగర్ లిబర్టీ కూడలి వద్ద పాము కలకలం - గంటపాటు ట్రాఫిక్‌కు అంతరాయం - Snake on Current Wire at Himayat Nagar - SNAKE ON CURRENT WIRE AT HIMAYAT NAGAR
🎬 Watch Now: Feature Video
Published : Jun 7, 2024, 7:41 PM IST
Snake on the Current Wire : హైదరాబాద్ హిమాయత్ నగర్ లిబర్టీ కూడలిలో తాచు పాము కలకలం సృష్టించింది. లిబర్టీ కూడలి సిగ్నల్ వద్ద ఉన్న వేప చెట్టుపై పాము ప్రత్యక్షమైంది. అక్కడి నుంచి కేబుల్ వైర్ల సాయంతో సిగ్నల్ ఫౌల్ వద్దకు వెళ్లింది. సిగ్నల్ కేబుళ్ల వైర్లపై ఒక్కసారిగా పాము ప్రత్యక్షం కావడంతో వాహనదారులు ఎక్కడికక్కడ వాహనాలు నిలిపివేసి, ఆ సన్నివేశాన్ని తమ చరవాణుల్లో బంధించారు. అంతేకాకుండా సెల్ఫీలు తీసుకుంటూ చాలా మంది జనం రోడ్డుపై గుమిగూడారు. దీంతో లిబర్టీ కూడలిలో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Snake found at Himayat Nagar Liberty Junction : సుమారు గంట పాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన పాము పోలీసులను ముప్పు తిప్పలు పెట్టింది. ఎట్టకేలకు సిగ్నల్ పౌల్ సాయంతో కిందకు దిగి, పక్కనే ఖాళీగా ఉన్న బిల్డింగ్ సెల్లార్లోకి వెళ్లింది. అయినప్పటికీ ఆ దృశ్యాలను వీడియోలు తీసుకుంటూ, జనం భారీగా అక్కడకు చేరి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించారు. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు, జనాలను చెదరగొట్టారు.