LIVE : భాగ్యనగరంలో ఘనంగా శ్రీరామనవమి శోభాయాత్ర - Sri Rama Shobha Yatra Live - SRI RAMA SHOBHA YATRA LIVE
🎬 Watch Now: Feature Video
Published : Apr 17, 2024, 4:19 PM IST
|Updated : Apr 17, 2024, 4:39 PM IST
Shobha Yatra on Sri Rama Navami Live : శ్రీరామనవమి పురస్కరించుకొని హైదరాబాద్‌లో అంగరంగా వైభవంగా శోభయాత్ర సాగుతోంది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన నేపథ్యంలో ఈసారి మరింత ఘనంగా జరుగుతోంది. శోభాయాత్ర కొనసాగే అన్ని మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు, పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ, రెవెన్యూ, జలమండలి, విద్యుత్ తదితర శాఖల అధికారులతో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. శోభాయాత్ర సీతారాంబాగ్ శ్రీరాముడి ఆలయం వద్ద మొదలై, మంగళ్‌హాట్, జాలీ హనుమాన్, ధూల్‌పేట్, పూరానాపూల్, జుమ్మేరాత్ బజార్, చుడీ బజార్, బర్తన్ బజార్, బేగంబజార్ ఛత్రి, సిద్యంబర్ బజార్, గౌలిగూడ చమన్, గురుద్వార, పుత్లిబౌలి, కోఠి మీదగా సుల్తాన్‌బజార్ హనుమాన్ వ్యాయామశాలకు చేరుకుని ముగియనుంది. వాహనదారులు, ప్రజలు పోలీసులు విధించిన ట్రాఫిక్ ఆంక్షలు పాటించి శోభాయాత్ర సాఫీగా కొనసాగేలా సహకరించాలని పోలీసు ఉన్నతాధికారులు కోరారు.
Last Updated : Apr 17, 2024, 4:39 PM IST