LIVE : 'శివం భజే' మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ - Shivam Bhaje movie trailer launch - SHIVAM BHAJE MOVIE TRAILER LAUNCH
🎬 Watch Now: Feature Video
Published : Jul 23, 2024, 12:07 PM IST
|Updated : Jul 23, 2024, 1:55 PM IST
Shivam Bhaje Movie Trailer Launch Event Live : తెలుగు బుల్లితెరపై ఓంకార్ పేరు తెలియని వారుండరు. తనదైన శైలిలో యాంకరింగ్‌తో ఆయన ఎన్నో ఏళ్ల నుంచి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇక ఆయన కుటుంబం నుంచి ఆయన సోదరుడు అశ్విన్ బాబు టాలీవుడ్లో ఇప్పటికే ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రాజుగారి గది 2 సినిమాతో అశ్విన్ తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. అయితే మిగతా హీరోల్లా కమర్షియల్ సినిమాల జోలికి వెళ్లకుండా తనదైన శైలిలో డిఫరెంట్ జానర్లలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇప్పటికే అశ్విన్ రాజుగారి గది3, నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్, హిడింబ సినిమాలు వచ్చాయి. తాజాగా : శివం భజే చిత్రంతో అశ్విన్ మన ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఇవాళ హైదరాబాద్ నగరంలో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో జరుగుతోంది. ఈ ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారం మీ కోసం.
Last Updated : Jul 23, 2024, 1:55 PM IST