కత్తి చూపి కారు చోరీ - శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఘటన - Shamshabad Airport Car Theft Arrest - SHAMSHABAD AIRPORT CAR THEFT ARREST
🎬 Watch Now: Feature Video
Published : Jun 26, 2024, 7:52 PM IST
Airport Car Theft Arrest : హైదరాబాద్ నగరంలో రోజు రోజుకూ పెరుగుతున్న చైన్ స్నాచర్లు, మొబైల్ చోరులు, దోపిడీ దొంగల ధాటికి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అటువంటి దారి దోపీడికీ సంబంధించిన ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కారు స్టెప్నీ అవసరం అంటూ అడిగి చాకుతో బెదిరించి, ఓ వ్యక్తి కారును దుండగులు ఎత్తుకెళ్లిన ఉదాంతం శంషాబాద్ విమానాశ్రయం పార్కింగ్‌లో ఈనెల 23న చోటుచేసుకుంది. ఈ చోరీ కేసులో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు పోలీసు నిర్ధారించారు.
అందులో ఒక నిందితుడు నజీబుల్లాఖాన్ అలియాస్ జాహిద్‌ను విమానాశ్రయ పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు మహమ్మద్ అబ్దుల్ మాజీద్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా వీరి వద్ద నుంచి దొంగలించిన మహేంద్ర ఎక్స్‌యూవీ కారు, బెదిరించటానికి ఉపయోగించిన చాకు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడు జాహిద్‌ను అరెస్టు చేసి రిమాండ్ తరలించామన్న శంషాబాద్ విమానాశ్రయ ఏసీపీ ప్రసాద్ రావు, వీరిపై గతంలో బాలాపూర్ పోలీస్ స్టేషన్లో కూడా పలు కేసులు ఉన్నట్లు వివరించారు.