మార్గదర్శి సంస్థపై 'సాక్షి' అసత్య ఆరోపణలు: కందుల రమేష్ - kandula ramesh fires on sakshi
🎬 Watch Now: Feature Video
Kandula Ramesh Fires on Sakshi Media: మార్గదర్శి సంస్థపై సాక్షి మీడియా అసత్య ఆరోపణలు చేసిందని సీనియర్ జర్నలిస్టు కందుల రమేష్ అన్నారు. ఆధారులు లేకుండా ఇష్టారీతిన ఆరోపణలు చేసిందని మండిపడ్డారు. మార్గదర్శిపై ఇన్ని అసత్య ఆరోపణలు చేసిన సాక్షి మీడియా ఐటీ అధికారులు ఇచ్చిన వివరణను ఎందుకు ప్రచురించలేదని సీనియర్ జర్నలిస్టు కందుల రమేష్ ప్రశ్నించారు. ఐటీ అధికారులు పరిశీలించి ఎలాంటి తప్పు లేదని నిర్ధారించారని కందుల రమేష్ తెలిపారు. ఓ ప్రైవేటు సంస్థపై ఇంత దారుణమైన ఆరోపణలు సరికాదన్న రమేష్, ఇలాంటి వాటిపై చర్యలు తీసుకునేందుకు పటిష్ట చట్టాలు రావాలని అభిప్రాయపడ్డారు.
కాగా విశాఖపట్నంలో మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ చందాదారులు చెల్లించిన నగదు, అకౌంట్ పేయీ చెక్కుల్ని ఏప్రిల్ 2న బ్యాంకులో జమ చేసేందుకు సిబ్బంది తీసుకెళ్తుండగా చెకింగ్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది. అన్ని ఆధారాలతో డెయిలీ క్యాష్ రిజిస్టర్ను అందించినా చెకింగ్ స్క్వాడ్ వాటిని పరిగణనలోకి తీసుకోకుండా నగదు, చెక్కులను సీజ్ చేసింది. ఈ విషయాన్ని మార్గదర్శి యాజమాన్యం ఆదాయపన్ను విభాగం, రిటర్నింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఆధారాలన్నీ పరిశీలించిన ఐటీ విభాగం, మార్గదర్శి సంస్థకు చెందిన నగదు, చెక్కుల్ని సీజ్ చేయడం సరికాదని స్పష్టం చేసింది. దీంతో స్వాధీనం చేసుకున్న నగదు, చెక్కుల్ని జిల్లా యంత్రాంగం తిరిగి అప్పగించింది. ఈ ఘటనపై సాక్షి మీడియా అడ్డగోలుగా దుష్ప్రచారం చేసింది. దీంతో సాక్షి మీడియాపై సీనియర్ జర్నలిస్టు కందుల రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.