'రాష్ట్రంలో 5 కేంద్రాల ద్వారా సేవలు - పాస్‌పోర్టు కావాలంటే అక్కడికి వెళితే చాలు' - Secunderabad RPO Snehaja - SECUNDERABAD RPO SNEHAJA
🎬 Watch Now: Feature Video
Published : Apr 13, 2024, 2:07 PM IST
Secunderabad RPO Snehaja Interview : పాస్ పోర్ట్‌ల జారీలో దేశంలో ఐదో స్థానంలో ఉన్న సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం, 2023లో 7.85 లక్షల మందికి పాస్ పోర్ట్‌లను జారీ చేసింది. ఇలా ఏటా లక్షల మంది వీటి కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ డిమాండ్‌ను అక్రమార్జన కోసం వినియోగించుకుంటున్న కొందరు అక్రమార్కులు, దరఖాస్తుదారుల నుంచి రూ.వేలల్లో వసూలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే విద్యావంతులు సైతం అక్రమార్కులు, దళారులను ప్రోత్సహిస్తున్న సందర్భాలూ ఉన్నాయి. కాగా పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా పాస్‌పోర్ట్‌ల జారీకి చర్యలు తీసుకుంటున్నట్లు సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి చెబుతున్నారు. రాష్ట్రంలో 5 పాస్‌పోర్ట్ కేంద్రాల ద్వారా సేవలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కొవిడ్ తరువాత వీటి సేవలు మరింత పెరిగినట్లు చెబుతున్నారు. మీ సేవ కేంద్రాల ద్వారా స్వయంగా దరఖాస్తు చేసుకుంటే మేలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాస్‌పోర్ట్ జారీకి సంబంధించిన మరిన్ని వివరాలను ఆర్‌పీవో స్నేహజ మాటల్లోనే విందాం.