ప్రైవేట్​ పరిశ్రమలో భారీ పేలుడు - వేడి ద్రవం పడి ముగ్గురికి తీవ్ర గాయాలు - Massive Explosion In Rangareddy

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Feb 19, 2024, 7:56 PM IST

Scan Energy Fire Accident At Shadnagar : రంగారెడ్డి జిల్లా షాద్​నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు మండల కేంద్ర సమీపంలో ఉన్న స్కాన్ ఏనర్జీ ప్రైవేటు పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. పనిలో నిమగ్నమైన కార్మికులపై వేడి ద్రవం పడినట్లు కార్మికులు తెలిపారు. దీంతో ఆ ప్రదేశమంతా పొగలు దట్టంగా వ్యాపించాయి. తీవ్రంగా గాయపడిన ఐదుగురు కార్మికులను చికిత్స నిమిత్తం షాద్ నగర్​లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్​కు తరలించారు. పేలుడులో గాయపడ్డ ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ పేలుడుతో పరిశ్రమ మొత్తం పొగ అలుముకోవడంతో కార్మికులు బయటికి పరుగులు తీశారు.  

Massive Explosion In Rangareddy : ఇద్దరు కార్మికులకు చర్మం కాలిపోయినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన అనిల్ పాశ్వాన్, కమల్ కిషోర్ షాద్ నగర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉత్తర భారత దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి పని చేయడానికి వచ్చామని కార్మికులు తెలిపారు. దీంతో కార్మికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.