అసెంబ్లీ ముందు సర్పంచుల ఆందోళన - అరెస్టు చేసిన పోలీసులు - Sarpanches Protest Pending Bills
🎬 Watch Now: Feature Video
Published : Feb 22, 2024, 1:43 PM IST
Sarpanches Protest For Pending Bills at Assembly : గ్రామ పంచాయతీలో సర్పంచులు అభివృద్ధి చేసిన పెండింగ్ బిల్లులను తక్షణమే ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేస్తూ, రాష్ట్ర సర్పంచుల సంఘం ఐకాస చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చింది. పబ్లిక్ గార్డెన్ (Public Garden) నుంచి ర్యాలీగా వచ్చిన సర్పంచులు, గన్ పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అభివృద్ధి పనులకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు.
Sarpanches Arrest for Protest at Assembly : కొంతమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని సర్పంచులు గుర్తు చేశారు. పెండింగ్ బిల్లులు ఇచ్చే వరకు గ్రామాలలో ప్రజా ప్రతినిధులను తిరగనివ్వకుండా అడ్డుకుంటామన్నారు. ఈ క్రమంలో సర్పంచులు గన్ పార్క్(Gun Park) నుంచి ఒక్కసారిగా అసెంబ్లీ ముందు రోడ్డుపై బైఠాయించారు. పెద్ద సంఖ్యలో సర్పంచులు ఆందోళన చేపట్టడంతో భారీగా ట్రాఫిక్ జామైంది. సర్పంచుల నిరసనను అడ్డుకున్న పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.