మేడారంలో మంత్రి సీతక్క ప్రెస్మీట్ - ప్రత్యక్షప్రసారం - Medaram Jatara 2024
🎬 Watch Now: Feature Video
Published : Feb 20, 2024, 6:06 PM IST
|Updated : Feb 20, 2024, 6:15 PM IST
Sammakka Saralamma Jatara 2024 : వనంలో ఉన్న దేవతలు జనం మధ్యకు వచ్చే శుభ ఘడియలు వచ్చేశాయ్. జంపన్న వాగు జనసంద్రంగా మారే ఘట్టం సమీపించింది. కీకరాణ్యం జనారణ్యమై కోలాహలంగా మారేది ఇక రేపటి నుంచే. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయలకు ప్రతిబింబింగా నిలిచే తెలంగాణ కుంభమేళా మేడారం(Medaram) మహా జాతర బుధవారం నుంచి ప్రారంభమవుతోంది. మాఘమాసం పౌర్ణమి రోజుల్లో ఏటా రెండేళ్లోకోసారి ఈ జాతర వేడుకగా జరగడం ఆనవాయితీగా వస్తోంది. మండమెలిగే పండుగతో గత బుధవారం జాతరకు అంకురార్పణ జరగ్గా వనం వీడి జనం మధ్యకు వచ్చే వన దేవతల ఆగమనంతో అసలైన మహా జాతర మొదలవుతోంది. దూరప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలు లెక్కచేయక భక్తులు తరలివస్తున్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కోరిన కోర్కెలు తీర్చే అమ్మలను దర్శించుకోవడం సంతోషంగా ఉందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రూ. 110 కోట్ల వ్యయంతో సర్కార్ జాతర కోసం అన్ని ఏర్పాట్లు చేసింది.