ఉప్పురైతులను నిలువునా ముంచేసిన అకాల వర్షం - ఆదుకోవాలని ప్రభుత్వానికి వినతి - untimely rains in Prakasam district - UNTIMELY RAINS IN PRAKASAM DISTRICT

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 18, 2024, 12:45 PM IST

Salt Farmers Suffered Losses : అకాల వర్షం ఉప్పు రైతులను నట్టేట ముంచేసింది. చేతికి వచ్చిందని అనుకున్న సమయంలో వర్షం కురవడంతో ఉప్పు నీటి పాలైంది. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం మోటుమాల గ్రామంలో దాదాపు 3 వేల ఎకరాల పైచిలుకు ఉప్పు పంటలు సాగు చేశారు. అప్పులు తెచ్చి పంటలు సాగు చేశారు. చేతికి వచ్చింది అనే సమయంలో వర్షం అకస్మాత్తుగా కురవటంతో ఉప్పంత జలమయం అయ్యింది. సుమారు 3 వేల ఎకరాల పైచిలుకు ఉప్పు పంటలు నీటిపాలయ్యాయి. 

Untimely Rains in Prakasam District : అప్పులు తెచ్చి సాగు చేసిన పంటలు చేతిక అందివచ్చాయని అనుకుంటున్న సమయంలో కుండపోతగా కురిసిన వాన రైతుల ఆనందాన్ని ఆవిరి చేసింది. వర్షం దెబ్బకు కౌలురైతులు కుదేలయ్యారు. ఎకరాకు యాభై వేలు ఖర్చు చేశామని ఇప్పుడు పదివేల రూపాయలు కూడా దక్కేటట్లు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దానికి తోడు ఉప్పు లారీ రూ.15000 గా దిగజారి ఉండడం అన్నదాతలు నానా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో లారీ ధర దాదాపు రూ.70 వేల నుంచి రూ60 వేల వరకు ఉండేదని, ఇప్పుడు ధర లేదని అన్నదాతలు వాపోతున్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.