భద్రాద్రి, కొండగట్టు ఆలయాల్లో భక్తుల రద్దీ - Rush at Bhadradri Temple today
🎬 Watch Now: Feature Video
Published : Jan 27, 2024, 1:54 PM IST
Rush at Bhadradri Temple : ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు రావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయం వద్దకు కదిలి రావడంతో ఆలయ ప్రాంగణంతా రద్దీగా మారింది.
ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాముల మూలమూర్తులకు ఆలయ అర్చకులు బంగారు తులసీ దళాలతో అర్చన చేశారు. భక్తులు అధిక సంఖ్యలో నిత్య కల్యాణ వేడుకకు కదలి రావడం వల్ల నిత్య కల్యాణ మండపంలో జరగాల్సిన వేడుకను చిత్రకూట మండపంలో నిర్వహించారు. భక్తుల రద్దీతో ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం ఉచిత దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది.
Rush at Kondagattu Temple : జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. మేడారం జాతర సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. క్యూలైన్లు నిండి వెలుపల భక్తులు బారులు తీరారు. స్వామి వారి దర్శనానికి గంట సమయం పడుతోంది. వందలాది వాహనాలతో ఘాటు రోడ్డు, ఆలయ పరిసరాలు నిండిపోయాయి.