ఆర్టీసీ కండక్టర్​ నిజాయతీ - 3 తులాల బంగారం ఉన్న బ్యాగ్ ప్రయాణికురాలికి​ అప్పగింత - Conductor Returns Gold Bag to wman - CONDUCTOR RETURNS GOLD BAG TO WMAN

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Aug 24, 2024, 2:26 PM IST

TGSRTC Conductor Returns Gold Bag to Passenger : విధి నిర్వహణలో ఆర్టీసీ బస్సు కండక్టర్​ నిజాయితీ చాటింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు దుబ్బాక బస్​ స్టేషన్​ నుంచి కామారెడ్డికి బయలుదేరింది. ఆ బస్సులో దుబ్బాక మున్సిపాలిటీ పరిధి ధర్మాజీపేటకు చెందిన రాజమణి అనే ప్రయాణికురాలు మూడున్నర తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.3000 నగదును పర్సులో పెట్టుకుని ప్రయాణిస్తోంది. 

ఆ పర్సును మర్చిపోయి స్టాఫ్​ వచ్చిందని దిగిపోయింది. ఆ పర్సను కండర్టర్​ దేవమ్మ గమనించింది. అందులో బంగారు ఆభరణాలతో పాటు నగదు ఉన్నట్లు గుర్తించింది. ఆ నగలు, నగదుతో ఉన్న పర్సును దేవమ్మ దుబ్బాక డిపో మేనేజర్​కు అప్పగించింది. ఆతర్వాత ప్రయాణికురాలు రాజమణిని వాకబు చేసి మూడున్నర తులాల బంగారం, రూ.3000 నగదును ఆమెకు అందజేశారు. కండక్టర్​ నిజాయతీని అందరూ ప్రశంసించారు. ఈ బంగారం విలువ రూ.2.50 లక్షలు ఉంటుందని తెలిపారు. దీంతో ప్రయాణికురాలు ఆనందం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.