నెల్లూరు నగరంలో రౌడీషీటర్‌ దారుణ హత్య - పాతకక్షలే కారణమా? - Rowdy Sheeter Brutal Murder

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 26, 2024, 11:30 AM IST

thumbnail
నెల్లూరు నగరంలో రౌడీషీటర్‌ దారుణ హత్య- పాతకక్షలే కారణమా? (ETV Bharat)

Rowdy Sheeter Brutal Murder in Nellore City : సాటి మనిషికి ఇబ్బంది కలిగేలా ప్రవర్తించడమే తప్పుగా పరిగణించే ప్రజాస్వామ్య దేశం మనది. అయినప్పటికీ ఎలాంటి భయం, విచక్షణ లేకుండా ఎదుటి వారి ప్రాణాలు తియ్యడానికి కూడా వెనకాడటం లేదు కొందరు వ్యక్తులు. కక్ష కట్టి ఒకర్నొకరు చంపుకుని వారి కుటుంబాల్లో విషాదాలు నింపుతున్నారు.

నెల్లూరు నగరంలోని రామలింగాపురం బ్రిడ్జి వద్ద రౌడీషీటర్‌ గుంజి రవి (40) దారుణ హత్యకు (Murder) గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓ హత్య కేసులో జైలుకు వెళ్లిన రవి ఇటీవలే విడుదలయ్యాడు. పాత కక్షల నేపథ్యంలో చింటూ, కమ్మసాయి, వెంకీడాన్‌తో పాటు మరికొందరు రవిని కత్తులతో పొడిచి హతమార్చారు. సమాచారం అందుకున్న బాలాజీ నగర్‌ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉండగా దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.