కనిపెట్టారు - బైక్​ నుంచి రూ.3.5 లక్షలు కొట్టేశారు - సీసీటీవీలో దృశ్యాలు - Theft Case in Uravakonda - THEFT CASE IN URAVAKONDA

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 6, 2024, 11:21 AM IST

Theft Case in Uravakonda : అనంతపురం జిల్లా ఉరవకొండలో చోరీ జరిగింది. ఓ రైతు తన ద్విచక్ర వాహనంలో నగదు తీసుకెళ్తుండగా దొంగలు ఏమార్చి దొంగతనానికి పాల్పడ్డారు. విడపనకల్లు మండలం ఉండబండ గ్రామానికి చెందిన వేణుప్రసాద్ మిర్చి పంటను విక్రయించాడు. ఇందుకు గాను వచ్చిన రూ.3.50 లక్షల నగదు వచ్చింది. ఆ డబ్బులను ఉరవకొండలోని ఎస్బీఐ నుంచి డ్రా చేశాడు. వాటిని తన ద్విచక్ర వాహనంలోని సంచిలో ఉంచాడు.

Uravakonda Theft Video Viral :  మార్గం మధ్యలో పని నిమిత్తం వేణుప్రసాద్​ సమీపంలోని బీరువాలు తయారు చేసే దుకాణం వద్దకు వెళ్లాడు. బైక్​ను బయటే నిలిపి లోపలికి వెళ్లగా ఇదే అదునుగా భావించిన దొంగలు ద్విచక్ర వాహనంలో ఉన్న నగదును చోరీ చేశారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. షాప్ నుంచి బయటకు వచ్చిన వేణుప్రసాద్​ నగదు కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. దొంగతనం జరిగిందని గ్రహించి లబోదిబోమన్నాడు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.