వాగు దాటలేక గర్భిణి 'నడక' యాతన - ఒడ్డునే ప్రసవం - ఒక పాప మృతి ఐసీయూలో మరో పసికందు - TRANSPORT PROBLEMS IN ASIFABAD - TRANSPORT PROBLEMS IN ASIFABAD
🎬 Watch Now: Feature Video
Published : Aug 10, 2024, 1:28 PM IST
Road Facility Not Available Pregnant Woman Issue : కుమురంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం వెంకటాపూర్ పంచాయతీ బండగూడకు చెందిన ఆత్రం ధర్మబాయి శుక్రవారం రోజున పురిటినొప్పులతో బాధపడుతుండగా అంబులెన్స్ కు గ్రామస్థులు సమాచారమిచ్చారు. గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో మధ్యలో వాగును అతికష్టం మీద దాటించి కిలోమీటరన్నర దూరం గర్భిణిని కాలినడకన తీసుకొచ్చారు.
ఆమె వాగు ఒడ్డుకు చేరుకోగానే ఆడపిల్లకు జన్మనిచ్చింది. అంబులెన్స్ సిబ్బంది బాలింతకు ప్రాథమిక పరీక్షలు చేసి ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జన్మించిన శిశువు మరణించిందని అక్కడి వైద్యులు తెలిపారు. అనంతరం పరీక్షించి కడుపులో మరో శిశువు ఉందని నిర్ధారించి మెరుగైన వైద్యం కోసం ఆమెను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. అక్కడ సాధారణ ప్రసవం కాగా ఆడపిల్లకు జన్మించింది. పుట్టిన శిశువు 800 గ్రాముల బరువు మాత్రమే ఉండటంతో ఐసీయూలో ఉంచి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. కళ్లు తెరవకముందే ఒక శిశువు విగతజీవిగా మారడం, మరో శిశువు అతి తక్కువ బరువుతో జన్మించడంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.