భారీ వర్షాలకు హుజూర్‌నగర్‌లోని రోడ్డు ధ్వంసం - నరకంగా మారిన ప్రయాణం - Nallacheruvu destroyed the Road - NALLACHERUVU DESTROYED THE ROAD
🎬 Watch Now: Feature Video
Published : Sep 5, 2024, 11:27 AM IST
Road destroyed in Burugadda: సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం బూరుగడ్డలో ఇటీవల కురిసిన భారీ వర్షానికి నల్లచెరువు కట్ట తెగిపోవడంతో పక్కనే ఉన్న రహదారి పూర్తిగా ధ్వంసం అయింది. ఈ మార్గం గోపాలపురం నుంచి బూరుగడ్డ, కరక్కయ్యలగూడెం వెళ్తుంది . గత నాలుగు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో రోడ్డు పై వెళ్లేందుకు వీలు లేకపోవడంతో పాఠశాల, కాలేజీలకు వెళ్లే విద్యార్థులతో పాటు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
చెరువు నుంచి దారి చేసుకొని గ్రామాలకు నడక మార్గంలో రాకపోకలు సాగిస్తున్నారు. అధికారులు స్పందించి తెగిన రోడ్డుకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. వరద పంట పొలాలను ముంచెత్తడంతో పాటు ఇసుక మేటలు వేశాయి. ఆరుగాలం కష్టపడే రైతులు ఇసుక మేటలను పొలాల్లో చూసి వాపోతున్నారు. ఈ వర్షాలు రైతులను నిండా ముంచాయని బాధపడుతున్నారు. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. కాగా హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి ప్రస్తుత నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ సమస్య పరిష్కరించాలని స్థానికులు మంత్రిని వేడుకుంటున్నారు.