నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఇద్దరు మృతి, మరో 10మందికి తీవ్ర గాయాలు - Nellore Road Accident Several Dead - NELLORE ROAD ACCIDENT SEVERAL DEAD

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 19, 2024, 5:30 PM IST

Massive Road Accident Nellore District: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు సమీపంలో ముంబయి జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో 10మంది తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. 

మృతులను ప్రకాశం జిల్లా గన్నవరం గ్రామానికి చెందిన మరియమ్మ, వెలిగండ్ల మండలం కంగనంపాడు గ్రామానికి చెందిన డేవిడ్​గా గుర్తించారు. కనిగిరి నుంచి నెల్లూరు వైపు వెస్తున్న ఆర్టీసీ బస్సు, ఆగి ఉన్న లారీని  వెనుక నుంచి ఢీకొనడంతో ప్రమాదం సంభవించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 47మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనతో మృతుల కుటుంబ సభ్యులతో పాటు ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.