బర్త్​ డే వేడుకలకు వెళ్లి వస్తుండగా పల్టీ కొట్టిన కారు - ముగ్గురి మృతి, మరో ముగ్గురికి తీవ్రగాయాలు - telangana crime news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jan 20, 2024, 10:52 AM IST

Road Accident in Gadwal District : జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పుట్టిన రోజు వేడుకలకు హాజరై, తిరుగు ప్రయాణంలో డివైడర్‌కు కారు ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ దుర్ఘటన గద్వాల జిల్లా జమ్మిచేడు సమీపంలో జరిగింది. ప్రమాద సమయంలో కారులోని ఆరుగురు ప్రయాణికుల్లో ముగ్గురు మరణించగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. 

Gadwal Road Accident Today : గద్వాలలో ఓ వైద్యుడి కుమార్తె పుట్టిన రోజు వేడుకలకు హాజరై పెబ్బేరుకు వెళ్తుండగా శుక్రవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. బలంగా డివైడర్‌కు ఢీకొనడంతో అదుపు తప్పిన కారు పల్టీలు కొట్టింది. పెద్దగా శబ్దం రావడంతో సమీపంలో ఉన్నవారు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఈ ప్రమాదంలో నరేశ్, పవన్ కుమార్, ఆంజనేయులు అనే ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరితో ప్రయాణిస్తున్న గోవర్ధన్, నవీన్, మహబూబ్ అనే మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.