బిర్యానీ తింటుండగా ఉంగరం - అవాక్కైన కస్టమర్లు - Ring in Biryani At Peddapalli - RING IN BIRYANI AT PEDDAPALLI
🎬 Watch Now: Feature Video
Published : Mar 21, 2024, 4:11 PM IST
Ring in Biryani At Peddapalli District : బిర్యానీ తింటుండగా ఉంగరం ప్రత్యక్షమైన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని కృష్ణ బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. బుధవారం రాత్రి కొంతమంది యువకులు భోజనం చేయడానికి అక్కడకు వచ్చారు. కొద్దిగా మద్యం, రెండు బిర్యానీలను వారు ఆర్డర్ చేశారు. రెస్టారెంట్లోని సప్లయర్ యువకులకు బిర్యానీ వడ్డించాడు. వారు తింటుండగా ఒకరి చేతికి గట్టిగా ఏదో తగిలింది. ఏంటా అని పరిశీలించి చూస్తే అది ఉంగరం.
బిర్యానీలో ఉంగరం కనిపిచడంతో యువకులు ఆశ్చర్యపోయారు. వెంటనే రిస్టారెంట్ సిబ్బందిని నిలదీయగా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. బిర్యానీలో ఎలా ఉంగరం వస్తుందంటూ ఎదురు ప్రశ్నించారు కానీ జవాబు చెప్పలేదు. సుమారు గంటసేపు వేచిచూసినా ఎలాంటి స్పందన లేకపోవడంతో కౌంటర్ వద్దకు వచ్చి ప్రశ్నించారు. అయినా ఫలితం లేకపోవడంతో చేసేదేమి లేక ఆ యువకులు వెనుతిరిగి పోయారు.