'తహసీల్దార్‌ రమణయ్య హత్య దారుణం - చట్టాలను కఠినతరం చేయాలి' - జవహర్‌రెడ్డితో రెవెన్యూ ఉద్యోగులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 7, 2024, 4:43 PM IST

Revenue Association on MRO Murder in Vijayawada : విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడి చేయకుండా చట్టాలను కఠిన తరం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి రెవెన్యూ ఉద్యోగులు వినతి పత్రం అందజేశారు. విశాఖలో తహసీల్దార్‌ రమణయ్యపై దాడి చేసి హత్య చేసిన ఘటన రాష్ట్రంలోని రెవెన్యూ ఉద్యోగుల్లో అభద్రతా భావానికి నిదర్శనం అని వివరించారు. 

మరోసారి అలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని  కోరారు.
సచివాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.ఏస్.జవహర్ రెడ్డి, మంగళగిరిలోని సీసీఎల్ఏ కార్యాలయంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి. సాయిప్రసాద్, చీఫ్ కమిషనర్ అఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ వారిని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ను కలిసి మెమొరాండం అందజేశారు. విధి నిర్వహణలో ఉన్న రమణయ్య పై జరిగిన ఘాతుకానికి తాము చింతిస్తున్నామని వాపోయారు. ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకుని రెవెన్యూ ఉద్యోగులకు భరోసా అందించాలని వారు కోరారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.