పెన్షన్ బకాయిలు విడుదల చేయాలి - రిటైర్డ్ ఉద్యోగుల ఆందోళన - పెన్షన్ల కోసం ఆందోళన
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 5, 2024, 5:48 PM IST
Retired Employees Agitation: పెండింగ్లో ఉన్న పెన్షన్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని రిటైర్డ్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలకు పూనుకున్నారు. ప్రభుత్వం పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈపీఎస్ 95 పెన్షనర్లకు కనీస పెన్షన్ 9 వేల రూపాయలు అందించాలని రిటైర్డ్ ఎంప్లాయిస్ అన్నారు. రద్దు చేసిన ఆర్ఓసి కమ్యూటేషన్ సౌకర్యాలను పునరుద్దించాలన్నారు.
పెన్షన్ ప్రైవేటీకరణ చర్యలను ఉపసంహరించాలని, ప్రతినెల ఒకటో తేదీన పెన్షన్లు, జీతాలను అందించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ శాఖలో ఉన్న 39 లక్షల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, ఈహెచ్ఎస్ పూర్తిస్థాయిలో నగదురహిత వైద్యం అందరికీ అందించాలని కోరారు. అదేవిధంగా సీపీఎస్, జీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్దించాలని కోరారు. రాష్ట్రంలోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని రిటైర్డ్ ఎంప్లాయిస్ కోరారు. తమ సమస్యలను పరిష్కరించకుంటే, ఉద్యమం మరింత ఉద్ధృతం చేస్తామని వారు తేల్చి చెప్పారు.