లంగర్‌హౌస్‌లో మూసీ నిర్వాసితుల ఆందోళన - చేతులెత్తేసిన పోలీసులు - Residents Protest At Langar Houz - RESIDENTS PROTEST AT LANGAR HOUZ
🎬 Watch Now: Feature Video
Published : Sep 27, 2024, 1:49 PM IST
Residents Protest At Langar Houz Road : హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రింగ్‌రోడ్డు పిల్లర్ నంబరు 102 వద్ద ఆశ్రమ్‌నగర్ కాలనీవాసులు రోడ్డుపై బైఠాయించారు. మూసీ ప్రక్షాళన అధికారులు సర్వేలు చేసి మార్కింగ్ చేశారు. తమ ఇళ్లను అన్యాయంగా కూల్చేస్తున్నారని ఆందోళనకు దిగారు. సుమారు 100 మంది రోడ్డుపై బైఠాయించడంతో రాజేంద్రనగర్ నుంచి మెహదీపట్నం వైపు వెళ్లే వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు అక్కడికి చేరుకున్నా ఆందోళనకారులను అదుపు చేయలేక చేతులెత్తేశారు.
తమకు న్యాయం జరిగే వరకూ ఆందోళన విరమించబోమని ఆశ్రమ్‌నగర్ కాలనీవాసులు తేల్చిచెప్పారు. ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. కాగా మూసీ ప్రక్షాళనలో భాగంగా గర్భంలో నిర్మాణాలను తొలగించడానికి అధికారులు రంగంలోకి దిగారు. అర్హులైన నిర్వాసితులకు రెండు పడకల గదుల ఇళ్లను కేటాయించేందుకు మరోసారి క్షేత్ర స్థాయిలో రీ సర్వే చేస్తున్నారు. నదీ గర్భంలో ఉన్న నిర్మాణాలు, నివాసాల యజమానుల నుంచి ఇంటి పత్రాలు, ఆధార్ సహా ఇతర ముఖ్య వివరాలను సేకరిస్తున్నారు.