'తెలుగు ప్రజలను ఏకతాటి పైకి తీసుకు రావడమే కేజీఎఫ్ లక్ష్యం' - tana president niranjan chowdary
🎬 Watch Now: Feature Video
Published : Mar 6, 2024, 7:31 PM IST
Release of Kamma Global Federation Brochure : ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలను ఏకం చేయడానికి, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కమ్మ గ్లోబల్ ఫెడరేషన్(KGF) ఏర్పాటు చేసినట్లు కేజీఎఫ్ వ్యవస్థాపకులు జెట్టి కుసుమ కుమార్ తేలిపారు. ఇవాళ హైదరాబాద్ మాదాపూర్లోని ఈ-గ్యాలేరీయ మాల్లో జెట్టి కుసుమ కుమార్ అధ్వర్యంలో కేజీఎఫ్ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. తానా అధ్యక్షులు నిరంజన్ చౌదరి ముఖ్య అతిథిగా హాజరై బ్రోచర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలను ఏకతాటి మీదకు తీసుకురావడానికి, తెలుగు ప్రజల సమస్యలను పరిష్కరించడానికి, కమ్మ సామాజిక వర్గ ప్రజల అభివృద్ధికి కేజీఏఫ్ దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సంవత్సరం జులై 21, 22వ తేదీల్లో రెండు రోజుల్లో గ్లోబల్ ఫెడరేషన్ సదస్సు నిర్వహించడం జరుగుతుందన్నారు. త్వరలో కేజీఏఫ్ విధీ విధానాలను ఈ సదస్సులో వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. ఇవాళ్టి కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేముల, తానా మాజీ అధ్యక్షులు అంజయ్య చౌదరి, రాజధాని ఫైల్స్ సినిమా డైరెక్టర్ రవి శంకర్, కర్ణాటక కమ్మ సంఘం అధ్యక్షులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు