thumbnail

By ETV Bharat Telangana Team

Published : Mar 7, 2024, 3:46 PM IST

ETV Bharat / Videos

హైదరాబాద్​లో రూ.50 లక్షల హవాలా డబ్బు స్వాధీనం

Rayadhurgam Police Seized Hawala Money : హైదరాబాద్​ మహానగరం అక్రమ తరలింపునకు అడ్డాగా నిలుస్తోంది. ప్రతిసారి ఏదో ఒక దొంగతనాలు, స్మగ్లింగ్​, హత్యలు, అక్రమ తరలింపులతో వార్తల్లో చేరుతోంది. తాజాగా లక్షల రూపాయల హవాలా డబ్బును కారులో తరలిస్తూ అడ్డంగా దొరికిపోయారు కొంతమంది. 

Rs. 50 lakhs Hawala Money Sized : ఈ ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎలాంటి పత్రాలు లేకుండా నగదును మహారాష్ట్రకు చెందిన విక్రమ్ నిన్న రాత్రి 12:30 గంటల సమయంలో డబ్బు తరలిస్తున్నారన్న పక్క సమాచారంతో మాదాపూర్ స్పెషల్​ ఆపరేషన్​ టీం (ఎస్​ఓటీ) పోలీసులు తనిఖీలు చేపట్టగా ఇన్నోవా క్రిస్టా కార్​లో తరలిస్తున్న రూ. 50 లక్షల హవాలా డబ్బును స్వాధీనం చేసుకున్నారు. డబ్బుల గురించి అడగగా రియల్ ఎస్టేట్ డబ్బులు అని ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో ఎస్​ఓటీ పోలీసులు రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకొని దొరికిన రూ. 50 లక్షలను ఐటీ డిపార్ట్​మెంట్​కు అప్పగిస్తామన్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.