వరద బాధితులకు రామోజీ గ్రూప్ అండ - ఖమ్మం జిల్లాలో నిత్యావసర సామాగ్రి పంపిణీ - Ramoji Group Help to Flood Victims - RAMOJI GROUP HELP TO FLOOD VICTIMS
🎬 Watch Now: Feature Video
Published : Sep 6, 2024, 10:24 PM IST
Ramoji Donation in Khammam District : ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు సాయం కోసం ఎదురు చూస్తున్న వరద బాధితులకు రామోజీ గ్రూప్ చేయూతనందించింది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ఆకేరు, మున్నేరు, పాలేరు పొంగి వేలాది మందిని నిరాశ్రయులను చేసింది. వరద తాకిడికి అనేక గ్రామాలను ఖాళీ చేసిన బాధిత జనం కట్టుబట్టలతో పునరావస కేంద్రాలకు తరలివెళ్లారు. తిరిగి వచ్చి చూస్తే వారి గూడు చెదిరి గుండెపగిలింది. ఇళ్లల్లో ధాన్యం, బియ్యం, నిత్యావసర సరుకులు, దుస్తులు అన్నీ వరదార్పణమయ్యాయి.
అలాంటి తరుణంలో బాధితులకు అండగా నిలిచే సంస్కృతిని రామోజీ గ్రూప్ సంస్థ కొనసాగించింది. ముంపునకు గురైన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని సుర్దేపల్లి గ్రామంలో నిత్యావసరాలతో కూడిన కిట్లను బాధితులకు అందచేసింది. మొత్తం 130 కుటుంబాలకు కిట్లను ఖమ్మం యూనిట్ ఇన్ఛార్జీ వీరబాబు నేతృత్వంలో సిబ్బంది కిట్లను బాధితులకు చేరవేశారు. రామోజీ గ్రూప్ సాయంపై నిరుపేదలు సంతోషం వ్యక్తం చేశారు. కష్ట కాలంలో ఆదుకున్నారంటూ సంస్ధ యాజమాన్యానికి కృతజ్ఞతలు చెబుతున్నారు.