LIVE: రాజ్యసభ సమావేశాలు- ప్రత్యక్ష ప్రసారం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 9, 2024, 11:05 AM IST
|Updated : Feb 9, 2024, 6:56 PM IST
Rajya Sabha Sessions Live : పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభమయ్యాయి. ఎన్నికలకు ముందు బడ్జెట్ సమావేశాలు కావడంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుత లోక్సభకు ఇవే చివరి సమావేశాలు కావడంతో కొత్త భవనంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. గురువారం ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను సమర్పించి తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
ఫిబ్రవరి 9వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు ముగియాల్సి ఉంది. కానీ బడ్జెట్ సమావేశాలు కావడంతో మరో రోజుకు పొడిగించారు. కావున శనివారంతో పార్లమెంట్ సమావేశాలు ముగుస్తాయి. శీతాకాల సమావేశాల్లో జరిగిన ఘటనల నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మొదటి రెండు రోజుల పాటు జీరో అవర్, ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేశారు. సోమవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చ జరగింది. పార్లమెంటు ఎన్నికలకు ముందు జరిగే చివరి సమావేశం కావడంతో ఉభయ సభలలోనూ వాడీవేడీ చర్చలు జరిగే అవకాశముంది. ఈ సందర్భంగా రాజ్యసభ సమావేశాల ప్రత్యక్ష ప్రసారం మీ కోసం.