LIVE: రాజ్యసభ సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం
🎬 Watch Now: Feature Video
Rajya Sabha Sessions Live : కాంగ్రెస్ పార్టీ ఆలోచనా విధానానికి కాలం చెల్లిందని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ తన పనిని అవుట్ సోర్సింగ్‌కు ఇచ్చిందన్నారు. ప్రతిపక్ష పార్టీ ఆ స్థాయికి దిగజారడం తమకు సంతోషం కానప్పటికీ, సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు ప్రధాని చెప్పారు. రిజర్వేషన్ల విషయంలోనూ ఆ పార్టీది ప్రతికూల వైఖరేనని విమర్శించారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు బుధవారం సమాధానం ఇచ్చిన క్రమంలో కాంగ్రెస్‌పై మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.రాష్ట్రాల మధ్య విభజన తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నం! : అధికార దాహంతో కాంగ్రెస్ ప్రభుత్వం రాత్రికిరాత్రే రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాలను రద్దు చేసిందని ప్రధాని మోదీ ఆరోపించారు. ప్రజాస్వామ్యం గొంతును నులిపేసిందన్నారు. ఇప్పుడు ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య విభజన తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని మోదీ ధ్వజమెత్తారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యల గురించి కాంగ్రెస్‌కు తెలుసని, వాటిని పరిష్కరించేందుకు ఏమీ చేయలేదని విమర్శించారు.ఫిబ్రవరి 9వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు ముగియాల్సి ఉంది. కానీ బడ్జెట్ సమావేశాలు కావడంతో మరో రోజుకు పొడిగించారు. శనివారం పార్లమెంట్ సమావేశాలు ముగుస్తాయి. ఈ సందర్భంగా రాజ్యసభ సమావేశాల ప్రత్యక్ష ప్రసారం మీ కోసం.
Last Updated : Feb 8, 2024, 8:01 PM IST