LIVE : రాజ్యసభ సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం - Rajya Sabha Sessions 2024
🎬 Watch Now: Feature Video
Rajya Sabha Sessions 2024 LIVE : పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు రాజ్యసభను కుదిపేసింది. వినేశ్ న్యాయం జరిగేలా చూడాలంటూ విపక్ష నేతలు కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. అలాగే వినేష్ అనర్హతపై దారితీసిన పరిస్థితులపై చర్చకు పట్టుబట్టాయి. అందుకు రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ అంగీకరించకపోవడం వల్ల విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.ఈ క్రమంలో రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ విపక్ష సభ్యుల ప్రవర్తనను తప్పుబట్టారు. "ఈ విషయం గురించి ప్రతిపక్షాలు మాత్రమే బాధపడుతున్నారని భావిస్తున్నారు. అందరికీ అదే బాధ ఉంటుంది. వినేశ్ ఫొగాట్‌కు జరిగిన అన్యాయం పట్ల యావత్ దేశం బాధలో ఉంది. ప్రతి ఒక్కరూ వినేశ్ ఫొగాట్‌కు అండగా నిలుస్తున్నారు. ఈ విషయాన్ని రాజకీయం చేస్తే ఆమెను అవమానించినట్లే అవుతుంది" అని విపక్ష సభ్యులపై రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ అసహనం వ్యక్తం చేశారు. అలాగే టీఎంసీ ఎంసీ డెరెక్ ఒబ్రెయిన్ తీరును సైతం ఖండించారు. "మీరు రాజ్యసభ ఛైర్మన్‌పై అరుస్తున్నారు. ఈ ప్రవర్తనను ఖండిస్తున్నాను. అలాంటి ప్రవర్తనను ఎవరైనా భరించగలరా?" అని ధన్‌ఖడ్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో కాసేపు సభ నుంచి రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ బయటకు వెళ్లిపోయారు. రాజ్యసభ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం మీ కోసం
Last Updated : Aug 9, 2024, 1:02 PM IST