'పంటకు నీరెంత అవసరమో, రాష్ట్రానికి రాజధాని అంతే అవసరం' - 'రాజధాని ఫైల్స్' ట్రైలర్ విడుదల - రాజధాని ఫైల్స్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 5, 2024, 3:41 PM IST
Rajadhani Files Movie Trailer Release: ఏదీ మా కలల రాజధాని ? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్ కలలు గని, తమకు అన్నం పెడుతున్న భూములను త్యాగం చేసినందుకు ఫలితం ఇదా ? అని మండిపడుతున్నారు. సీన్ కట్ చేస్తే రాజధాని రైతుల కష్టాలను తలపిస్తూ నిర్మించిన 'రాజధాని ఫైల్స్' చిత్రం ట్రైలర్ విడుదలైంది. పంటకు నీరెంత అవసరమో రాష్ట్రానికి రాజధాని అంతే అవసరం అంటున్నారు సీనీ నిర్మాత కంఠమనేని రవిశంకర్. ఆయన నిర్మాణ సారథ్యంలో తెలుగు వన్ ప్రొడక్షన్స్ పతాకం (Telugu One Productions Banner)పై భాను దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'రాజధాని ఫైల్స్'.
ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల (Amaravati Farmers) అవస్థల నేపథ్యంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ నెల 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా రాజధాని ఫైల్స్ ట్రైలర్ (Rajadhani Files Movie Trailer) ను చిత్ర బృందం విడుదల చేసింది. సీనియర్ నటుడు వినోద్ కుమార్, వాణి విశ్వనాథ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలోని సన్నివేశాలు, సంభాషణలు రాష్ట్రంలోని నేటి పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండటం విశేషం.